టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి సుకుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుకుమార్ ఆఖరుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా పుష్పా పార్ట్1 మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ అత్యంత భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే మరీ ముఖ్యంగా ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ప్రకటించినటువంటి నేషనల్ అవార్డ్ పలో అల్లు అర్జున్ కు ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడు అవార్డు కూడా దక్కింది. దానితో ఈయన క్రేజ్ ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లో పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతోంది.  పుష్ప పార్ట్ 1 మూవీ అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో సుకుమార్ కూడా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో ఓ జాతర సన్నివేశం ఉండబోతున్నట్లు చాలా రోజులుగా వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సన్నివేశం ఇంటర్వెల్ కి ముందు వస్తుందట.

దానితో ఈ సన్నివేశం సినిమాకు హైలైట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో సుకుమార్ ఈ సన్నివేశం తీసే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు అని తెలుస్తుంది. దాదాపు ఒక చిన్న సినిమా తీసే అన్ని రోజులు ఈ సినిమాలోని ఈ ఒక్క సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సుకుమార్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఫహద్ ఫాసిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa