టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికి తెలిసిందే. ఈ మధ్యనే గుంటూరు కారం మూవీతో డిజాస్టర్ టాక్ తోనే 250 కోట్ల పైగా వసూళ్ళు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే మహేష్ ఫస్ట్ మురారి లాంటి క్లాసిక్ మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు.మురారి సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ఒక్కడు. సీనియర్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహేష్ బాబుని టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ స్టార్ ని చేసింది. ఇంకా అంతేకాకుండా మహేష్ బాబు క్రేజ్ ని పెంచడంతోపాటు కెరిర్ గ్రాఫ్ ని కూడా ఈ సినిమా మార్చేసింది. సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.ముఖ్యంగా సినిమాలో చార్మినార్ సెట్ న్యాచురాలిటీ అలాగే కొండారెడ్డి బురుజు దగ్గర ఇంటర్వెల్ బ్లాక్ మహేష్ బాబు ప్రకాష్ రాజు మధ్య సన్నివేశాలు అలాగే భూమిక ప్రకాష్ రాజ్ మధ్య ట్రాక్, అలాగే క్లైమాక్స్ లో కబడ్డి ఫైట్.. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సినిమా కేవలం మహేష్ బాబుకే కాదు.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకే గర్వ కారణమైన సినిమా. 2003 లో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు, సాధించిన అవార్డులు అన్నీ ఇన్ని కావు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బెస్ట్ క్లాసిక్ ఇది.అయితే మన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ ఒక్కడు సినిమా తమిళంలో విజయ్ హీరోగా గిల్లి అనే పేరుతో రీమేక్ అయి అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. కానీ ఒక్కడు రేంజ్ లో అయితే ఈ సినిమా ఉండదు.


ఎక్కువ శాతం మహేష్ బాబు సినిమాలనే రీమేక్ చేసే విజయ్ ఈ గిల్లి సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ గిల్లి సినిమా విజయ్ అభిమానులకు చాలా స్పెషల్ .అయితే ఒక్కడు సినిమాని విజయ్ అభిమానులు ఇష్టపడడంలో తప్పులేదు కానీ, ఆ సినిమాను ఒక్కడు సినిమాతో కంపేర్ చేస్తూ, సోషల్ మీడియాలో ఒక్కడు సినిమా కంటే గిల్లి సినిమా బాగుందని అర్ధం పర్ధం లేని కామెంట్స్ చేస్తున్నారు.మహేష్ బాబు కంటే విజయ్ బాగా నటించాడు అంటూ కామెంట్ చేయడం మన తెలుగు వాళ్ళకి కోపం తెప్పించింది. అసలు విజయ్ ఎక్కడ మహేష్ ఎక్కడ.. విజయ్ యాక్టింగ్ ఏంటి మహేష్ యాక్టింగ్ ఏంటి.. విజయ్ కి మహేష్ కి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. విజయ్ లాంటి చెత్త యాక్టర్ తో మహేష్ లాంటి సూపర్ యాక్టర్ కి పోలిక ఏంటి.. ఏ యాంగిల్ లో చూసినా మహేష్ బాబే విజయ్ కంటే 100 రెట్లు బెటర్.. ఒక్కడు లాంటి క్లాసిక్ తో ఈ గిల్లి సినిమాకి పోలిక ఏంటని తెలుగు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలా తమిళ వాళ్లపై తెలుగు వాళ్లు ఆన్లైన్ లో మండిపడుతున్నారు. విజయ్ ని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఒక్కడు సినిమా ఫిబ్రవరి 23 వ తేదీన హైదరాబాద్ సంధ్య 70 ఎమ్ ఎమ్ థియేటర్లో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: