యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఊరు పేరు భైరవ కోన. అనిల్ సుంకర ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సమర్పణంలో హాస్యం మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమా రిలీజ్ ముందే సినిమాలోని నిజమేలే చెబుతున్న పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట ఈ సినిమా ప్రమోషన్స్ కి బాగా ప్లస్ అయ్యింది. చాలా మంది ఈ పాట కోసం సినిమాకి వెళుతున్నారు. ఇక లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.3 రోజుల్లోనే 20 కోట్ల గ్రాస్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ నైజాం లో 4 రోజుల్లో 5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. నైజాం లో ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుందని సమాచారం తెలుస్తుంది. ఇక ఓవరాల్ గా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఊరు పేరు భైరవ కోన సినిమా వసూళ్లు బాగున్నాయి.


సినిమా వసూళ్ళని ఇంకా పెంచడానికి మూవీ టీం వారు ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ యాడ్ చేయబోతున్నారు. ఈ సీన్స్ ఖచ్చితంగా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతాయట.సందీప్ కిషన్ కొన్నాళ్ల నుంచి చాలా సినిమాలైతే చేస్తున్నాడు కానీ సరైన హిట్ దక్కలేదు. అయితే ఈ ఊరు పేరు భైరవ కోన సినిమా తో మంచి టాక్ తెచ్చుకున్నారు. ఫిక్షనల్ స్టోరీతో వి.ఎఫ్.ఎక్స్ ప్రధానంగా సాగిన ఈ మూవీ చూసిన ఆడియన్స్ అంతా సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ మూవీ లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయ్యి సేఫ్ అవుతుందో లేదో చూడాలి. సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తరువాత అలాంటి హిట్ ని ఇప్పటిదాకా అందుకోలేదు. అప్పటినుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఊరు పేరు భైరవ కోన సినిమాతో హిట్టు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: