నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు చాలా తక్కువ సమయంలోనే వరుస సినిమాలను చేస్తూ, ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.బాలయ్య సినీ కెరియర్ స్టార్ట్ చేసిన మొదట్లో ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి అనేది ‘ఎన్టీఆర్ ‘ డిసైడ్ చేసేవాడు. ముందుగా ఆయన కథలు విని అందులో బాలయ్య కి ఏ కథ సెట్ అవుతుందో ఆయన సెలెక్ట్ చేసి బాలయ్యతో సినిమాలు చేయించేవాడు. అందువల్లే బాలయ్య కెరియర్ మొదట్లో మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగాడు. ఇక ఇదిలా ఉంటే ఒకానొక సమయంలో బాలయ్య బాబుకి వరుసగా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఆయన కెరియర్ అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ బోయపాటి లాంటి ఒక స్టార్ డైరెక్టర్ బాలయ్య బాబుకి మరొకసారి ‘ సింహా ‘ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందించాడు. ఇక అప్పటి నుంచి బాలయ్య వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లోనే ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఆ మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి భారీ సక్సెస్ లను అందుకున్నాయి. ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో నాలుగో సినిమా కూడా రాబోతుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటూ నందమూరి అభిమానులు ఇప్పటికే స్టొరీ ని తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా యూనిట్ నుంచి ఒక న్యూస్ అయితే లీక్ అయింది. ఇక ప్రస్తుత తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య ఈ సినిమాలో సీఎంగా కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు బాలయ్య ఏ సినిమాలో కూడా సీఎం పాత్రను పోషించలేదు. అయితే ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ సీఎం తలచుకుంటే ఏదైనా చేయొచ్చు, జనాలకు మంచి చేసి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు అనే కాన్సెప్ట్ ఈ సినిమాను రూపొందించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాను తొందర్లోనే సెట్స్ మీదికి తీసుకెళ్లి ప్రయత్నంలో అటు బోయపాటి, ఇటు బాలయ్య ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది…

మరింత సమాచారం తెలుసుకోండి: