తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గత ఏడాది కళ్యాణ్ రామ్ నటించిన అమీగొస్ చిత్రంలో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయింది కన్నడ ముద్దుగుమ్మ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన గ్లామర్ తో మాత్రం ఫిదా చేసింది ఆ తర్వాత నాగార్జున నటించిన నా సామిరంగా సినిమాలో ఆషికా రంగనాథ్ నటించి మరింత ఆకట్టుకుంది. తన నటనతో ప్రేక్షకులను కూడా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో ఈ ఆమ్మడి క్రేజ్ మరింత పెరిగింది.


తన కెరియర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల కథలను సెలెక్టివ్ గా ఎంచుకుంటోంది.సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ తన అంద చందాలతో కుర్రకారులను మాయ చేస్తూ ఉంటుంది. చీరలో దిగిన ఫోటోలు అయినా సరే ఎంతో ఆకట్టుకునే విధంగా చేస్తుంది. అప్పుడప్పుడు జిమ్ వర్కౌట్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వర్కౌట్ వీడియోని షేర్ చేస్తూ తన ట్రైనర్ తనకు ఎప్పుడు నిజమైన వర్కౌట్ గురించి గుర్తు చేస్తారంటూ క్యాప్షన్ రాసుకుంది.


ప్రస్తుతం ఆషికా వర్కౌట్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. టైట్ జిమ్ వేర్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్క ఎగ్జిట్ మెంట్ తో ఒక రేంజ్ లో వర్క్ అవుట్ చేస్తోంది ఎలాంటి వర్క్ అవుట్ లలో లైనా సరే తగ్గేది లేదన్నట్టుగా జిమ్ చేస్తోంది.క్యూట్గా నవ్వుతూ రిలాక్స్ అవుతూ యోగాసనాలు వేస్తూ ఈ వీడియోని విడుదల చేయడంతో అభిమానుల సైతం ఒకసారిగా షాక్ కి గురవుతున్నారు. ఇటీవల చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో అవకాశాన్ని అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషియో ఫాంటసి జోనర్ గా వస్తున్న ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ చిరంజీవికి చెల్లెల్లుగా నటిస్తున్నారు ఇందులో ఈమె పాత్ర కూడా ఒకటి ఉందంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: