టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో పుష్ప ఒకటి. నిజానికి ఈ చిత్రానికి సంబంధించిన పార్ట్ 1 పుష్ప ది రైజ్ రిలీజ్ అయినప్పుడు తెలుగు రాష్ట్రాలలో మిశ్రమ స్పందన వచ్చింది.మొదటివారం కలెక్షన్స్ కూడా పర్వాలేదు అనిపించుకున్నాయి. ఆ తర్వాత చిత్రానికి విపరీతమైన క్రేజ్ పెరగడంతో పాటు బాక్సాఫీస్ బద్దలయ్యే కలెక్షన్స్ వసూల్ అయ్యాయి.అయితే ఈ చిత్రం సౌత్ కంటే నార్త్ లో బీభత్సాన్ని సృష్టించింది. రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేయడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. మరీ ముఖ్యంగా ఈ మూవీకి సంబంధించి యూట్యూబ్ కోసం డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన గోల్డ్ మైన్స్ సంస్థకు నిజంగానే ఈ చిత్రం గోల్డ్ మైన్ గా మారింది.పుష్ప చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. ఈ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలకు తగినట్టుగానే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తరకెక్కిస్తున్నారు మేకర్స్. త్వరలో విడుదలకు సిద్ధం కాబోతున్న పుష్ప 2 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న వార్త విడుదలైన అది వెంటనే హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇటీవల పుష్ప స్టార్ అల్లు అర్జున్ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో జరిగిన పుష్ప1 ప్రీమియం షో పాల్గొన్న విషయం తెలిసిందే.
మామూలుగా ఇలాంటి ఫెస్ట్ లకు సెలబ్రిటీలు హాజరు అయినప్పుడు ఎంతో కొంత హడావిడి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా..ఎటువంటి బజ్ లేకుండా సడన్గా బన్నీ బెర్లిన్ చేరుకోవడం వెనుక ఓ పెద్ద బిజినెస్ సీక్రెట్ ఉందని టాక్. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పుష్ప 2 ది రూల్ మూవీ ను మైత్రి సంస్థ వారు అన్ని ప్రధాన భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం అవడం కోసం బెర్లిన్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్ట్ ను పుష్ప బృందం వేదికగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
యూరప్ దేశాలలో సినిమాకు మార్కెట్ ఏర్పడి పంపిణీ జరగాలంటే వాళ్ళు మద్దతు ఇవ్వడం ఎంతో కీలకం. అందుకే పుష్ప మొదటి భాగాన్ని చూపించి వాళ్లకు చిత్రం పై నమ్మకాన్ని కలిగించడానికి ఈ ఏర్పాట్లు చేసినట్లు టాక్. ఇప్పటివరకు యూఎస్, యూకే ,ఆస్ట్రేలియా లాంటి దేశాలలో మన సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఇప్పుడిప్పుడే అరబ్ కంట్రీస్ లో కూడా మన సినిమాలకు క్రేజ్ ఏర్పడుతుంది. అయితే ఈ క్రేజ్ ను మరింత విస్తరించి.. తెలుగు సినీ మార్కెట్ ను గ్లోబల్ మార్కెట్ గా చేయడానికి పుష్ప బృందం భారీ ప్లానింగ్ లో ఉన్నారు. ఇదే జరిగితే పుష్ప కొత్త రికార్డులను సృష్టించడం కన్ఫామ్ అంటున్నారు బన్నీ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: