షీనా బోరా సెన్సేషనల్ హత్య కేసుపై ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ అనే డాక్యుమెంటరీ సిరీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే.. అయితే ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రాకముందే చర్చనీయాంశంగా మారింది.షీనా బోరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా నిందితురాలిగా ఉండడం సహా చాలా సంచలన విషయాలు, మలుపులు ఉన్న కేసు కావడంతో ఈ సిరీస్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీటీలో రానున్న ఈ సిరీస్‍ను స్ట్రీమింగ్‍కు రాకుండా ఆపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI).. కోర్టులో పిటిషన్‍ను ఇటీవల దాఖలు చేసింది. దానిపై వాదనలు విన్న కోర్టు తీర్పును వెలువరించింది.ఫిబ్రవరి 23వ తేదీన ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ డాక్యు సిరీస్ స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ప్రకటించింది. అయితే, ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఈ సిరీస్ వస్తే ఇన్వెస్టిగేషన్ ప్రభావితం అవుతుందని ముంబైలోని ఓ ప్రత్యేక కోర్టులో సీబీఐ కేసు వేసింది. అయితే, వాదనలు విన్న న్యాయస్థానం ఈ సిరీస్ స్ట్రీమింగ్‍ను ఆపాలని ఆదేశించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు లైన్ క్లియర్ అయినట్లయింది.
ఆ సిరీస్ బ్రాడ్‍కాస్ట్‌ను ఆపే స్వాభావిక అధికారం కోర్టుకు లేదని, సంబంధిత ఫోరమ్‍ను సంప్రదించాలని సీబీఐ స్పెషల్ జడ్జి ఎస్‍పీ నాయక్ నింబల్కర్  సీబీఐకు సూచించారు. దీంతో 23వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు మార్గం సుగమమైంది.ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ సిరీస్‍లో షీనా బోరా హత్య కేసులో నిందితులతో పాటు సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారని, విచారణ ముగిసే వరకు ఇది స్ట్రీమ్ కాకుండా ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ తరఫున కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీకే నందోడ్ గత వారం పిటిషన్ వేశారు. నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియా ఈ డాక్యుమెంటరీకి స్క్రిప్ట్ మరియు మెటీరియల్ అందించి ఉండొచ్చని, విషయాలను వక్రీకరించే అవకాశం ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో పాటు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీకి కూడా కోర్టు నోటీసులు పంపింది.దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. ఏదైనా కంటెంట్ బ్లాక్ చేయాలంటే నిబంధనల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ సెక్రటరీ ప్రదిపాదించాల్సిందిగా కోర్టు తెలిపింది.అలాంటిది ఏమీ సమర్పించినందున సీబీఐ వేసిన పిటిషన్‍ను తిరస్కరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: