మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.కుటుంబం ఆదేశిస్తే జనసేన తరపున ప్రచారం చేయడానికి సిద్ధమేనని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. విజయవాడకు రావడం ఆనందం గా ఉందని తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు సినిమా రాలేదని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు. ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఆ లోటు ను తీరుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా దేశభక్తి బ్యాక్ డ్రాప్ మూవీ అని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు.మార్చి 1వ తేదీన ఆపరేషన్ వాలంటైన్ విడుదల కానుందని కొన్ని సినిమాలు ప్లాన్ చేస్తే జరగవని ఇది అలాంటిదేనని ఆయన చెప్పుకొచ్చారు. కంచె తర్వాత ఇలాంటి సినిమా లో చేయడం లక్ గా భావిస్తున్నానని వరుణ్ తేజ్ అన్నారు. పుల్వామా ఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా బ్లాక్ డే ఘటన జరిగిందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.యుద్ధ విమానాల నేపథ్యం లో వచ్చే సీన్స్ విశేషంగా అలరిస్తాయని ఆయన కామెంట్లు చేశారు. అదే రోజు వాలెంటైన్ కావడంతో ఆపరేషన్ వాలెంటైన్ అని టైటిల్ ఫిక్స్ చేశామని వరుణ్ తేజ్ వెల్లడించారు. గతంలో నాన్న ప్రచారం చేసినప్పుడు నేను వెళ్లానని ఆయన తెలిపారు. బాబాయ్ సిద్ధాంతాలపై, నడిచే దారిపై నమ్మకం ఉందని ఆ విషయంలో ఎప్పుడూ సపోర్ట్ చేస్తానని వరుణ్ తేజ్  చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: