తెలుగు సినీ పరిశ్రమలో కమీడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారి లో వైవా హర్ష ఒకరు . ఇక  పోతే ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించాడు. అలాగే ఎన్నో వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు . కాకపోతే ఎక్కువ శాతం ఈయన సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో కామెడీ పాత్రలలోనే నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు సుందరం మాస్టర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయగా అది ప్రేక్షకులను అధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ యూట్యూబ్ లో దక్కింది.

మూవీ ట్రైలర్ సూపర్ గా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా కాస్త పెరిగాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ బృందం వారు పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: