మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో కిక్ మూవీ ఒకటి. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇకపోతే ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీస్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా ప్రకటించింది. 

ఇకపోతే కిక్ మూవీ కి సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్ ను రేపు అనగా ఫిబ్రవరి 21 వ తేదీన సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కిక్ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టైలిష్ దర్శకుడు గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... గోవా బ్యూటీ ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు.

ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. మరి ఇప్పటికే రవితేజ హీరో గా రూపొందిన కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో వెంకీ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ ను జనాలు నుండి తెచ్చుకుంది. మరి కిక్ మూవీ రీ రిలీజ్ కోసం కూడా జనాలు ఎంతో ఆత్రుతగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి రెస్పాన్స్ ను అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: