తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ధనుష్ ఒకరు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితమే కెప్టెన్ మిల్లర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ తమిళ భాషలో ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయిన కెప్టెన్ మిల్లర్ సినిమా పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే తాజాగా ధనుష్ "రయాన్" అనే సినిమాను మొదలుపెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ధనుష్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈయనే స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. 

మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ధనుష్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ లో ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమాలోని సూర్య కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఇక తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూర్య కుర్చీలో కాలుపై కాలు వేసుకొని కూర్చుని ఒక చేతిలో గ్లాస్ పట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ధనుష్మూవీ లో హీరో గా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ధనుష్ ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా హీరో గా కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: