నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన సమర సింహా రెడ్డి సినిమా ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సిమ్రాన్ హీరోయిన్ గా నటించగా ... మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఆ సమయం లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. 

ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ఆ సమయంలో అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఆ టైం లో సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని మార్చి 2 వ తేదీన గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

మరి ఆ సమయం లో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ... ఈయన ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: