మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా ఇండియన్స్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఇండియా వైడ్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇక పోతే ఈయన ఇప్పటికే కొన్ని తెలుగు సినిమా లలో కూడా నటించాడు .

అందులో భాగంగా కొంత కాలం క్రితం మమ్ముట్టి , అక్కినేని అఖిల్ హీరో గా టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ లోని మమ్ముట్టి నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే తాజాగా మమ్ముట్టి "భ్రమయుగం" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ ఇప్పటికే మలయాళం లో విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇలా మలయాళం లో విడుదల అయి బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ఫిబ్రవరి 23 వ తేదీన తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ అయ్యాయి. ఇకపోతే ఈ సినిమా యొక్క టికెట్ ధరలు హైదరాబాద్ నగరంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయిలు గాను ... మల్టీ ప్లెక్స్ థియేటర్ లలో 200 రూపాయలు గాను ఉంది. ఇలా ఈ సినిమా మామూలు టికెట్ ధరల తోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: