టాలీవుడ్ యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మార్చి 1 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. 

ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు అనగా ఫిబ్రవరి 21 వ తేదీన ఈ మూవీ బృందం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కొన్ని ప్రధాన నగరాలను పర్యటించారు. ఈ మూవీ బృందం వారు మొదట విజయవాడ లో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ బృందం వారు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కు బయలు దేరింది. అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు "వి వి ఐ టి" కాలేజీ నీ పర్యటించింది.

ఆ తర్వాత ఏలూరు కు బయలు దేరింది. ఏలూరు లో రాత్రి 8 గంటలకు గాలయగూడెం టెంపుల్ ను పర్యటించింది. ఇలా ఈ రోజు ఆపరేషన్ వాలెంటైన్ మూవీ బృందం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రధాన నగరాలను పర్యటించింది. ఇకపోతే ఆపరేషన్ వాలెంటైన్ మూవీ కి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహించగా ... మనిషి చిల్లర్ ఈ మూవీ లో వరుణ్ తేజ్ కు జోడి గా నటించింది. రూహాని శర్మ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మధ్య కాలంలో వరస అపజయాలను అందుకుంటున్న వరుణ్మూవీ తో ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: