ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు లో పర్వాలేదు అనే స్థాయి ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా కొన్ని తెలుగు సినిమాలలో నటించి ఆ తర్వాత ప్రియాంక తమిళ సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ ను చూపించింది. అందులో భాగంగా ఈ బ్యూటీ నటించిన చాలా తమిళ సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ప్రియాంక కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరస పెట్టి తెలుగు లో సినిమాలను చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ప్రియాంక , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "ఓజి" మూవీ లోను ... నాని హీరో గా రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే వరుస సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: