సంక్రాంతి పండుగకి రిలీజైన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 'గుంటూరు కారం' డిజాస్టర్ టాక్ తోనే ఫైనల్ రన్ లో హిట్ స్టేటస్ సంపాదించింది. మహేష్ క్రేజ్ వల్ల ఆయన లక్షలాది ఫ్యాన్స్ ఈ సినిమాని రిపీటెడ్ గా చూశారు.అందువల్ల ఈ సినిమా 252 కోట్ల వసూళ్ళని కోళ్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా షేర్ ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ గా 128 కోట్ల దాకా షేర్ రాబట్టింది.ఈ సినిమాకి వచ్చిన టాక్‌తో పోలిస్తే  మంచి వసూళ్లే సాధించింది.బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న పాన్ ఇండియా సినిమా 'హనుమాన్' పోటీని తట్టుకుని దానికి ధీటుగా మంచి వసూళ్లు సాధించడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ పవర్ కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. సూపర్ స్టార్ మహేష్ మేనియా ఎలాంటిదో థియేట్రికల్ రిలీజ్ అప్పుడే కాదు.. డిజిటల్ రిలీజ్ సందర్భంగా కూడా మరోసారి రుజువైంది.'గుంటూరు కారం' సినిమా పది రోజుల కిందటే నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఈ సినిమా టాప్‌లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతుంది.


హిందీలో, ఇంగ్లిష్‌లో పెద్ద పెద్ద సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ.. 'గుంటూరు కారం' సినిమా గ్లోబల్ చార్ట్స్‌లో ఆధిపత్యం చలాయిస్తోంది. ఇక రెండో వారంలో కూడా ఈ సినిమాకు 18 లక్షల వ్యూస్ వచ్చాయని.. వరల్డ్ వైడ్ లిస్ట్‌లో ఈ సినిమా ఏకంగా టాప్-8లో ఉందని నెట్ ఫ్లిక్స్ స్పందించింది.బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే జస్ట్ హిట్ అయిన ఈ సినిమాకు ఓటీటీలో గ్లోబల్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం నిజంగా గొప్ప విషయమే. షారుఖ్ ఖాన్ డంకీ సినిమా వరల్డ్ వైడ్ టాప్-5లో కొనసాగుతోంది. విశేషం ఏంటంటే గుంటూరు కారం తెలుగు వెర్షన్‌ కంటే మిన్నగా హిందీ వెర్షన్‌కు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. 'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేశాడు. సూపర్ స్టార్ మహేష్ కోసమే సినిమా చూడొచ్చు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. టాక్ బాలేకున్నా సరే.. మహేష్ కోసం థియేటర్లలో బాగా చూశారు. ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ సినిమాను జనం బాగా చూస్తున్నారు. ఓటిటిలో చూసిన వాళ్లు థియేట్రికల్ రిలీజ్ టైంలో మరీ అంత నెగెటివ్ టాక్ రావాల్సింది కాదు అని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: