సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అమలాపాల్ ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించారు.ఇలా పలు సినిమాలలో నటించినటువంటి దర్శకుడు విజయ్ తో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్నారు పెళ్లి జరిగినటువంటి కొన్ని నెలలకి ఈమెకు తన భర్తతో మనస్పర్ధలు రావడంతో తన భర్త నుంచి విడాకులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇలా భర్త నుంచి విడాకులు తీసుకున్నటువంటి అమలాపాల్ సినిమాలలో నటిస్తూ వచ్చారు. అయితే ఈమె విడాకుల తర్వాత కాస్త బోల్డ్ షో చేస్తూ సినిమాలలో కూడా నటించారు. ఇలా సినిమాలలో నటిస్తూ ఉన్న తరుణంలోనే ఈమె మరో వ్యక్తి ప్రేమలో పడ్డారు. జగత్ దేశాయ్ అనే వ్యక్తిని ప్రేమించినటువంటి ఈమె తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచారు.ఇలా తమ ప్రేమ విషయాన్ని బయట చెప్పకుండా ఉన్నటువంటి ఈమె ఒకరోజు తన ప్రియుడిని అందరికీ పరిచయం చేశారు ఇలా పరిచయం చేస్తున్నటువంటి అమలాపాల్ 15 రోజులలోనే తన ప్రియుడిని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విధంగా అమలాపాల్ గత ఏడాది నవంబర్ 5వ తేదీ వివాహం చేసుకున్నారు. అయితే వివాహం చేసుకున్నటువంటి రెండు నెలలకే ఈమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించారు. ఈ విధంగా అమలాపాల్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా వేదికగా తన బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాకుండానే అప్పుడే ప్రెగ్నెంట్ ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని ప్రెగ్నెన్సీ విషయం బయటపడటంతోనే వెంటనే పెళ్లి కూడా చేసుకున్నారని అర్థమవుతుంది. ఇలా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి అమలాపాల్ తన భర్తతో కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. తాజాగా ఈమె తన భర్తతో ఉన్నటువంటి ఒక రొమాంటిక్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఒకవైపు బేబీ బంప్ ఉండగానే మరోవైపు తన భర్తతో రొమాంటిక్ గా చిల్ అవుతూ తన భర్తకు ముద్దులు పెడుతూ ఉన్నటువంటి వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒకసారిగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేయాల్సినటువంటి రొమాన్స్ ఇలా బహిరంగంగా చేయడమేంటి ఒకవైపు కడుపుతో ఉండగా మరి ఇలాంటి చెత్త పనులు ఏంటి అంటూ పలువురు ఈమెపై కామెంట్లు చేస్తున్నారు. అయితే సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణమేనని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: