ప్రస్తుతం స్టార్‌ హీరోల పారితోషికాలు డబుల్‌ సెంచరీలు కొడుతున్నాయి. అయితే ఓ స్టార్‌ హీరో ఏకంగా నిమిషానికి నాలుగున్నర కోట్లు పారితోషికం తీసుకోవడం షాకిస్తుంది.స్టార్‌ హీరోల పారితోషికాలు ఇటీవల అమాంతం పెరిగిపోతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్‌ స్టార్స్ ఏకంగా వంద నుంచి రెండు వందల కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ 150-200కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. అలాగే చిరంజీవికి వంద కోట్ల ఆఫర్ వచ్చింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌లకు వాళ్లు నటిస్తున్న సినిమాలకు వంద కోట్లకు పైగానే ముట్టుతుందట. మరోవైపు తమిళంలో రజనీకాంత్‌, దళపతి విజయ్‌ వంద కోట్లు దాటేశారు. `జైలర్‌`కి రజనీకి రెండు వందల కోట్లు వచ్చింది. ఇప్పుడు విజయ్‌ 200కోట్లు తీసుకుంటున్నాడు.మరోవైపు బాలీవుడ్‌లోనూ షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, అక్షయ్‌, హృతిక్‌ వంటి స్టార్స్ వంద కోట్లకు దగ్గరలో ఉన్నారు. అయితే ఒక బాలీవుడ్‌ హీరో మాత్రం ఏకంగా నిమిషానికి 4.5కోట్లు పారితోషికంగా తీసుకోవడం సంచలనంగా మారుతుంది. అది తెలుగు సినిమాకే కావడం విశేషం. మరి ఆ బాలీవుడ్‌ స్టార్‌ ఎవరు, ఆ తెలుగు సినిమా ఏంటి? అనేది చూస్తే..రాజమౌళి చివరి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. బాహుబలి`తో ఆయన సంచలనాలు సృష్టించింది. సినిమా బడ్జెట్‌, కలెక్షన్ల లెక్కలను మార్చేశాడు. భారీ సినిమాలు చేయోచ్చనే ధైర్యాన్నిచ్చాడు. దీంతో ఆ తర్వాత వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు రూపొందడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు పదికిపైగా చిత్రాలు ఇలా వందల కోట్లబడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాలు తెలుగులో ఉండటం విశేషం. అయితే రాజమౌళి తెరకెక్కించిన `ఆర్‌ఆర్‌ఆర్‌ సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.ఆర్‌ఆర్‌ఆర్‌ లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ మెయిన్‌ హీరోలుగా చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ గెస్ట్ రోల్‌ చేశారు. సముద్రఖని, శ్రియా, అలియా భట్‌ ఇతర పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు 35కోట్ల వరకు పారితోషికం ఇచ్చారట. ఆ తర్వాత పెంచారని సుమారు 50కోట్ల వరకు వారికి దక్కిందని ప్రచారం జరిగింది. అలాగే గెస్ట్ రోల్‌ చేసిన అజయ్‌ దేవగన్‌కి కూడా అంతే పారితోషికం అందించారట.

  `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో అజయ్ దేవగన్‌ నటించారు. ఆయన పాత్ర నిడివి ఎనిమిది నిమిషాలు. ఇందుకోసం ఆయనకు నిర్మాత డీవీవీ దానయ్య 35కోట్లు పారితోషికం ఇచ్చాడట. అలా ఆయనకు నిమిషానికి 4.5కోట్ల పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. ఈ లెక్కన ఆయన సినిమా మొత్తం ఉంటే రెండు వందల కోట్లు కూడా దాటేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన హీరోగా సినిమా చేసినా 35కోట్లే పారితోషికం తీసుకుంటారట. కానీ సినిమా సక్సెస్‌ అయితే ప్రాఫిట్‌లో 50శాతం షేర్‌ తీసుకుంటారట. అలా ఆయనకు ఒక్కో సినిమాకి వంద కోట్లకుపైగానే పారితోషికంగా దక్కుతుందని చెప్పొచ్చు.ఇప్పుడు చాలా మంది హీరోలు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. పారితోషికం తక్కువ తీసుకుని ప్రాఫిట్‌లో షేర్‌ తీసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న `ఎస్‌ఎస్‌ఎంబీ29`కి కూడా మహేష్‌ అలానే పారితోషికం కాకుండా ప్రాఫిట్‌లో షేర్‌ తీసుకోబోతున్నారట. అదే సమయంలో నిర్మాణంలోనూ భాగమవుతున్నారట. ఆయనతోపాటు మిగిలిన బిగ్‌ స్టార్స్ కూడా ఇదే దారిలో వెళ్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: