అసలు ఏమీ లేని స్థితిలో పని పట్ల ఎంతో అంకితభావంతో ఉంటారు. నమ్ముకున్న పని మీద తప్ప వేరే వాటి మీద ధ్యాస ఉండదు. తీరా అవకాశాలు వచ్చి కొంచెం స్టార్ డం వచ్చాక కొంతమంది దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు.అదృష్టం బాలేక కొంతమందికి ఆ స్టార్ డం నిలబడకపోతుంటే.. కొంతమంది మాత్రం తమ అజాగ్రత్త వల్ల వచ్చిన క్రేజ్ ని నాశనం చేసుకుంటున్నారు. ఫన్ బకెట్ భార్గవ్ నుంచి మొదలుపెడితే మొన్న పుష్ప ఫేమ్ జగదీశ్, నిన్న పక్కింటి కుర్రాడు చందు, షణ్ముఖ్ జస్వంత్ ఇలా వీళ్లంతా తెలియక చేసిన తప్పుల వల్ల, తెలిసి చేసిన తప్పుల వల్ల కేసుల్లో ఇరుక్కున్నారు. అందరూ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఫన్ బకెట్ భార్గవ్ తనదైన కామెడీతో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే వచ్చిన పేరుని అమ్మాయి వల్ల పోగొట్టుకున్నాడు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో భార్గవ్ మీద దిశ, పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఎలాగోలా బయటకొచ్చాడు. ఇది జరిగిన చాలా కాలానికి రీసెంట్ గా పుష్ప నటుడు జగదీశ్ అమ్మాయి కేసులో ఇరుక్కున్నాడు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేసే ఓ యువతి ఆత్మహత్య కేసులో జగదీష్ ప్రతాప్ బండారి అరెస్ట్ అయ్యాడు. పెద్దగా గుర్తింపు లేని సమయంలో జగదీష్ జూనియర్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ బాగా దగ్గరయ్యారు. అయితే పుష్ప సినిమాతో జగదీష్ కి క్రేజ్ రావడంతో వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. దీంతో ఆ యువతి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అది భరించలేని జగదీష్ ఆమె వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను తన స్మార్ట్ ఫోన్ లో చిత్రీకరించాడు జగదీష్. ఆ తర్వాత వాటితో బ్లాక్ మెయిల్ చేసేవాడు. అది సహించలేని ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి తండ్రి ఫిర్యాదుతో జగదీష్ అరెస్ట్ అయ్యాడు.

ఇక పక్కింటి కుర్రాడు చందు సాయి కూడా యూట్యూబరే. కెరీర్ కూడా సూపర్బ్ గా సాగిపోతుంది. చిన్న వయసులోనే మంచి స్టార్ డం సంపాదించుకున్నాడు. ఒక పక్క యూట్యూబ్ వీడియోస్, వెబ్ సిరీస్ లు.. మరోపక్క సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ లైఫ్ ని బాగా లీడ్ చేస్తున్నాడు. యూట్యూబ్ వీడియోస్ లో కూడా మెసేజులు ఇస్తుంటాడు. లైఫ్ లో ఎలా ఉండాలో చెప్పే చందు సాయి రీసెంట్ గా ఓ అమ్మాయి విషయంలో అరెస్ట్ అయ్యాడు. ఓ యువతిని ప్రేమించాడని.. పెళ్లి కూడా చేసుకుంటానని ఆమెకు మాట ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ అమ్మాయిని చందు పెళ్లి పేరుతో మోసం చేశాడని.. దీంతో ఆ యువతి రేప్ కేసు పెట్టినట్లు మనం విన్నాం. చందు సాయి కొన్ని రోజులు జైలు జీవితం గడిపి బయటకి వచ్చాడు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై వచ్చిన వార్తలు నిజం కాదని అన్నాడు. కొన్ని రోజులు చందు సాయి టాపిక్ నడిచింది. జనాలు మర్చిపోయారనుకుంటే ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే షణ్ముఖ్ డైరెక్ట్ గా ఏ అమ్మాయితోనూ మిస్ బిహేవ్ చేయలేదని తెలుస్తోంది. కానీ ఆ అమ్మాయికి వెబ్ సిరీస్ లలో ఛాన్స్ ఇస్తానని నమ్మించి మోసం చేశాడన్న ఆరోపణలు అయితే వచ్చాయి. మరోవైపు షణ్ముఖ్ అన్నయ్య అదే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. వారం రోజుల్లో పెళ్లి అనగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రేమించిన అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫ్లాట్ కెళ్ళడంతో డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక అమ్మాయి వల్ల ఇవాళ షణ్ముఖ్ కేసులో ఇరుక్కున్నాడు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో మెసేజ్ ఇచ్చే షణ్ముఖ్.. తన అన్న ఒక అమ్మాయిని మోసం చేస్తుంటే మాత్రం తప్పని చెప్పలేకపోవడం కూడా ఇవాళ అతని అరెస్టుకి కారణం అని చెప్పవచ్చు.
ఇలా ఫన్ బకెట్ భార్గవ్, పుష్ప నటుడు జగదీష్.. పక్కింటి కుర్రాడు చందు.. షణ్ముఖ్ జస్వంత్.. ఒక అమ్మాయి విషయంలోనే కేసులో ఇరుక్కున్నారు. చాలా మందికి వయసు దాటిపోయిన తర్వాత సక్సెస్ వస్తుంది. కానీ వీళ్ళకి మాత్రం తక్కువ వయసులోనే సక్సెస్ వచ్చింది. జనాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒక రకంగా వీళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకోవడంలో మాత్రం తడబడుతున్నారు. వీరి మీద వచ్చినవి ఆరోపణలా, వాస్తవాలా అన్న విషయం పక్కనబెడితే.. అసలు ఆరోపణలు వచ్చే స్థాయికి ఎందుకు వెళ్లడం అనేది ఇప్పుడు ప్రశ్న. ఒకప్పుడు నటులు ఎలా ఉండేవారు. ప్యాకప్ చెప్పారా? మేకప్ తీసేశామా? ఇంటికి వచ్చేసామా? ఫ్యామిలీతో సరదాగా గడిపామా? పేరు, పలుకుబడి, ఆస్తులు సంపాదించామా? వాటిని నిలబెట్టుకున్నామా? అన్నట్టు ఉండేవారు. అఫ్ కోర్స్ కొంతమంది నటులు దానాలు చేసి, జల్సాలు చేసి పోగొట్టుకున్నారు కావచ్చు కానీ చాలా మంది మాత్రం లైఫ్ విషయంలో సీరియస్ …

మరింత సమాచారం తెలుసుకోండి: