గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూనం కౌర్ ఆ తర్వాత కాలం లో సినిమాలకు పూర్తి గా దూరమైంది.ఆంధ్ర ప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడడంతో ఆ విషయం మీద ఫోకస్ చేస్తున్న ఆమె సినిమాల కు దూర మైందని అందరూ అను కున్నారు. అయితే కత్తి మహేష్ బతికి ఉండ గా బయటకు వచ్చిన కొన్ని ఆడియో లీక్స్ సంచలనం రేపాయి. అప్పటి నుంచి ఆమె గురూజీ అనే పేరుతో కొన్ని విమర్శలు చేస్తూ వచ్చేవారు. ప్రస్తావించకపోయినా అది త్రివిక్రమ్ అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేది. అయినా సరే ఇప్పటి వరకు ఎప్పుడూ సంయమనం కోల్పోయి మాట్లా డని ఆమె తాజాగా త్రివిక్రమ్ యూజ్లెస్ ఫెలో అంటూ ఒక పోస్ట్ చేసి కలకలం రేపింది.
ఒక వెబ్ న్యూస్ పోర్టల్ తాజా గా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఒకదానిని షేర్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ ప్రస్తావన తీసుకొచ్చారు. త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ ను కూడా తాను పంచ్ డైలాగ్స్ లాగా చెప్పలేనని పేర్కొన్నారు. అదే వీడియో కింద పూనం కౌర్ త్రివి క్రమ్ యూజ్లెస్ ఫెలో అని కామెంట్ చేసింది. సాధారణంగా ఈ కామెంట్ చూసిన అందరూ అది ఫేక్ అకౌంట్ అని, ఎవరో చేసిన కామెంట్ అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే అది పూనం కౌర్ ఒరి జినల్ అకౌంట్. దీంతో ఏకంగా త్రివిక్రమ్ పేరుని లాగుతూ ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీ యాంశమయ్యాయి. నిజానికి త్రివిక్రమ్ కు పూనం కౌర్ కు మధ్య ఉన్న గొడవేమిటి అనే విషయం మీద ఇప్పటివరకు ఎవరూ క్లారిటీగా మాట్లాడింది లేదు. అలాంటిది ఇప్పుడు ఆమె ఏకంగా త్రివిక్రమ్ యూజ్లెస్ ఫెలో అనడం హాట్ టాపిక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: