వైవా అనే షార్ట్ ఫిల్మ్ తో పాపులర్ అయ్యి సినిమాలో ఛాన్స్ అందుకున్న వైవా హర్ష అలియాస్ హర్ష చెముడు లీడ్ రోల్ లో వచ్చిన సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమాను కళ్యాణ్ సంతోష్ డైరెక్ట్ చేశాడు. రవితేజ చినెమాస్, గోల్డెన్ మీడియా బ్యానర్ కలిసి ఈ సినిమా నిర్మించింది. వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హర్షకి జోడీగా దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకుంది.

అంతేకాదు సినిమాకు జీరో కట్స్ ఇంకా ఎలాంటి మ్యూట్స్ లేకుండా సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారట. ఈమధ్య కాలం లో ఇలా సెన్సార్ నుంచి చిన్న కట్ కనీసం ఒకటి రెండు బీప్స్ లేకుండా రిలీజ్ అవుతున్న సినిమా ఇదే కావొచ్చు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలన్న ఆలోచనతో క్లీన్ ఎంటర్టైనర్ సినిమాలను అందించడం మర్చిపోయారు తెలుగు మేకర్స్. ఈ క్రమంలో సుందరం మాస్టర్ లాంటి సినిమా వారికి కనువిప్పు కలిగిస్తుంది.

సెన్సార్ కట్స్, బీప్ లేకుండా సినిమా చూడాలనుకుంటున్న తెలుగు ఆడియన్స్ కు సుందర్మ్ మాస్టర్ ఒక మంచి సినిమాగా వస్తుంది. ఈ సినిమా రన్ టైం కూడా కేవలం 2 గంటలు మాత్రమే అని తెలుస్తుంది. హర్ష లీడ్ రోల్ ల్ వెరైటీ అటెంప్ట్ గా చేసిన ఈ సుందరం మాస్టర్ తప్పకుండా తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు. రవితేజ, సుధీర్ కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఉండగా సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాపై హర్ష మాత్రం చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే తప్పకుండ యువ దర్శకులంతా ఇలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: