ఇండస్ట్రీలో మహిళలకు ఉండే ప్రాధాన్యం వివక్ష తదితర అంశాల పైన కూడా ఈమె మాట్లాడడం జరిగింది.. అయితే ఏ ఇండస్ట్రీ అనే విషయం మాత్రం చెప్పలేదు కానీ.. ఇండస్ట్రీ గురించి అయితే తెలియజేసింది. ప్రపంచంలో చాలా చోట్ల ఈ క్వాస్టింగ్ కౌచ్ ఉంది.. అయితే తన వరకు మాత్రం రాలేదని తాను ఇప్పటివరకు ఆలాంటివి ఫేస్ చేయలేదని తెలిపింది. క్వాస్టింగ్ కౌచ్ ఎక్కువగా మహిళలే ఫేస్ చేయడానికి కారణం ప్రపంచంలో ఉన్న అందమైన మహిళలు అందంగా కనిపించిన వారిని అట్రాక్ట్ చేస్తారని తెలిపింది.
ఇలాంటి విషయాలలో మహిళలు కచ్చితంగా ధైర్యంగా ఉండాలని నీ లిమిట్స్ లో నువ్వు ఉండడం అది ధైర్యం అని చెప్పవచ్చు.. ఒకవేళ ఒప్పుకోకపోతే అవకాశాలు రావేమో అని ఫీలింగ్ నుంచి బయటికి రావాలని ఇది కాకపోతే ఇంకో లైఫ్ లేదా అని ఉద్దేశంతో ముందుకు వెళ్లాలని తెలిపింది. కానీ అలా భయపడే వాళ్ళు ఎక్కువగా కమిట్ అయిపోతున్నారని.. వారి ప్రలోభాలకు కి సైతం లొంగిపోతున్నారని వేరే అవకాశం లేదు అనుకునే వారే మాత్రమే అలా చేస్తారని.. తాను ఏదైనా చేయగలనే ధైర్యం ఉంటే ఎలాంటి ఇబ్బందులకు లొంగకుండా వాటిని ఫేస్ చేసి ముందుకు వెళ్లడం ఉత్తమం అని తెలిపింది. ఇలాంటి విషయాలను చాలా ధైర్యంగానే నో చెప్పాలని తెలిపింది. చాలామంది అవకాశాలని క్యాష్ చేసుకుంటున్నారంటూ తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి