టాలీవుడ్ ఇండస్ట్రిలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్నప్పటికీ నవీన్ పోలిశెట్టి తీరు మాత్రం విభిన్నం. తన వద్దకు వచ్చిన ప్రతి  అవకాశాన్ని  ఒప్పుకోకుండా తాను నటించే సినిమాలోని తన పాత్ర  అదేవిధంగా కధ  నచ్చితేనె ఈయంగ్ హీరో తన డేట్స్ ఇస్తున్నాడు. ‘జాతిరత్నాలు’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని  అంగీకరించకుండా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ కధ నచ్చి తనకన్న వయసులో పెద్ద అయిన అనుష్కతో నటించేందుకు ఓకె చెప్పి రిస్క్ తీసుకుని ఎవరు ఊహించని సక్సస్ అందుకున్నాడు.ఈమూవీ విడుదలై 8నెలలు దాటిపోతున్నా నవీన్ తన తదుపరి సినిమాల పై క్లారిటీ ఇవ్వడం లేదు. ఆమధ్య ఈయంగ్ హీరో ఒక ప్రముఖ బ్యానర్ లో ‘అనగనగా ఒక రాజుని’ ప్రకటించి కొంతభాగం షూటింగ్ చేశాక ఆపేశారు అన్నవార్తలు వచ్చాయి. ఈమూవీ దర్శకుడుని మార్చారు  అన్నప్రచారం కూడ జరిగింది. కానీ ఆతర్వాత ఈ విషయం పై ఎలాంటి సమాచారం లేదు.ఈపరిస్తుతులు ఇలా ఉండగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి భారీ బడ్జెట్ తో తీయబోతున్న ‘రామాయణం’ మూవీలో   నవీన్ నటించ బోతున్నాడు  అంటూ  బాలీవుడ్  మీడియా వార్తలు రాస్తోంది. ఈమూవీలో   రాముడు గా రణబీర్ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. సీతగా సాయి పల్లవి విభీషణుడిగా విజయ్ సేతుపతి రావణుడి గా ఈమూవీలో నటించబోతున్నారు అంటూ గాసిప్పులు వస్తున్న విషయం తెలిసిందే.ఈ పరిస్థితుల మధ్య కీలకమైన లక్ష్మణుడి పాత్ర కోసం ఈమూవీ దర్శకుడు నవీన్ పోలిశెట్టి తో సంప్రదింపులు జరుపుతున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వరాస్తోంది. గతంలో నితీశ్ తివారి తీసిన ‘చిచోరే’ లో నవీన్ ఒక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆతరువాత అతడికి అనేక అవకాశాలు బాలీవుడ్ నుండి వచ్చినప్పటికీ వాటిని నవీన్ సున్నితంగా తిరస్కరించాడు అని అంటారు. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈ యంగ్ హీరోని లక్ష్మణుడి పాత్రకు ఎంపిక చేస్తే దేశవ్యాప్తంగా అతడి పేరు మారుమ్రోగి పోతుంది..  మరింత సమాచారం తెలుసుకోండి: