కొన్ని సంవత్సరాల క్రితం అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , రావు రమేష్ , బ్రహ్మానందం , ఆలీ కీలక పాత్రలలో గీతాంజలి అనే సినిమా రూపొందిన విషయం మనందరికీ తెలిసిందే. హర్రర్ కామిడీ జోనర్ లో రూపొందిన ఆ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకుంది. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లను కూడా రాబట్టింది.

ఇకపోతే గీతాంజలి సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , సునీల్ , సత్య ముఖ్య పాత్రలలో "గీతాంజలి మళ్లీ వచ్చింది" అనే సినిమాను రూపొందించారు. ఇకపోతే ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.

మూవీ టీజర్ ఆధ్యాతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం , అలాగే ఇందులోని కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఈ మూవీ టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. మరి ఇప్పటికే గీతాంజలి మూవీ మంచి విజయం సాధించడం ... ఆ మూవీ కి ఈ సినిమా కొనసాగింపుగా రూపొందడంతో "గీతాంజలి మళ్లీ వచ్చింది" మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: