నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను డి వి వి ధానయ్య నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాని ఈ సంవత్సరం ఆగస్ట్ 15 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటి వరకు ప్రకటించకపోయినప్పటికీ ఇప్పటికే సరిపోదా శనివారం సినిమా షూటింగ్ మాత్రం చాలా వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. 

దానితో నాని ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నిన్న అనగా ఫిబ్రవరి 24 వ తేదీన నాని పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా నాని , సుజిత్ దర్శకత్వంలో v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య బ్యానర్ లో ఓ మూవీ చేయబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే నిన్న ఈ మూవీ బృందం నాని హీరో గా సుజిత్ దర్శకత్వంలో డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ మూవీ రూపొందబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ చిన్న వీడియోను కూడా విడుదల చేశారు.

దానికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం సుజిత్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా "ఓజి" అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే నాని తో ఈ యువ దర్శకుడు సినిమా మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: