శర్వానంద్ , జై , అంజలి , అనన్య ప్రధాన పాత్రలలో కొన్ని సంవత్సరాల క్రితం జర్నీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక పోతే ఈ మూవీ మొదట తమిళ్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకు న్నాయి . ఆ తర్వాత ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే 2011 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ సమయం లో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. అలాగే ఈ మూవీ లోని శర్వానంద్ , జై , అంజలి , అనన్య నటనలకు ప్రేక్షకుల నుండి ... విమర్శకు ల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇకపోతే ఆ సమయంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. కొన్ని రోజుల్లో క్రితమే ఈ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. కాకపోతే అప్పుడు ఈ సినిమాను ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు మార్చి 6 వ తేదీన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీస్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. శరవనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి సి సత్య సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: