మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాగ చైతన్య హీరో గా రూపొందిన సవ్యసాచి అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇకపోతే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయం అందుకోకపోయినప్పటికీ ఇందులో ఈమె తన నటనతో , అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. 

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడి గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈమె రెండు భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇకపోతే సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఓలకబోస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా నిధి అగర్వాల్ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నిధి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: