తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి హర్ష చెముడు తాజాగా సుందరం మాస్టర్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హర్ష వర్ధన్ , దివ్య శ్రీపాద , బాలకృష్ణ నీలకంఠపు , భద్రం తదితరులు ముఖ్య పాత్రలలో నటించగా ...కళ్యాణ్ సంతోష్మూవీ కి దర్శకత్వం వహించాడు.  రవితేజ , సుధీర్ కుమార్ కుర్రు ఈ మూవీ ని నిర్మించగా ... శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందించాడు.  దీపక్ యెరగేరా ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయగా ... కార్తీక్ వున్నవా ఈ మూవీ కి ఎడిటర్ గా వర్క్ చేశాడు. 

ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 23 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ లకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.03 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వేరు అవుతుంది. ఇక మొదటి రోజు మంచి కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి కలెక్షన్ లను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: