బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటి మనులలో కంగనా రనౌత్ ఒకరు. ఈమె సినిమాల ద్వారా ఏ స్థాయిలో వార్తల్లో నిలుస్తూ ఉంటుందో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇకపోతే ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తం గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది . కొంత కాలం క్రితం ఈమె రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందినటువంటి ఏక్ నిరంజన్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది .

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజ యాన్ని అందుకోకపోయినప్పటికీ ఈ బ్యూటీ మాత్రం ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత కంగనా మళ్లీ హిందీ సినిమాలలోనే నటిస్తూ వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. అలాగే ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉండడంతో కంగనా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను ఒక్కో సినిమాకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వెళితే ... కంగనా దాదాపుగా ఒక్కో సినిమాకు 15 నుండి 27 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ ను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సినిమా కథ మొత్తం విన్నాక అందులోని కథ , తన పాత్ర అద్భుతంగా నచ్చితే అలాగే ఆ దర్శకుడు , నిర్మాతలను బట్టి ఈమె రెమ్యూనరేషన్ ను డిసైడ్ చేస్తుంది అని ... అలాగే సినిమాకు ఇచ్చే తేదీలను బట్టి కూడా తన రెమ్యూనరేషన్ డిసైడ్ చేస్తుంది అని తెలుస్తుంది. ఇకపోతే కొన్ని సినిమాల కథ బాగా నచ్చినట్లు అయితే చాలా తక్కువ రెమ్యూనిరేషన్ కి కూడా ఈ బ్యూటీ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: