కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన అమిగోస్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఆశిక రంగనాథ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే అమిగోస్ మూవీ ద్వారా పెద్దగా గుర్తింపును సంపాదించుకొని ఈ ముద్దు గుమ్మ తాజాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

ఇకపోతే ఈ మూవీ మంచి విజయం సాధించడం ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో నా సామి రంగా సినిమాతో ఈ బ్యూటీ కి తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే నా సామి రంగా సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను పర్వాలేదు అనే స్థాయిలో ఆరబోస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్ర కారుకు హిట్ పెంచుతుంది. 

ఇక తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అశిక స్కై బ్లూ కలర్ లో ఉన్న జీన్స్ ప్యాంట్ ను ధరించి వైట్ కలర్ లో ఉన్న షర్ట్ ను వేసుకొని హాట్ అండ్ కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోసే విధంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: