లోక నాయకుడు కమల్ హాసన్ కొంత కాలం క్రితం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కంటే ముందు వరుస అపజాయలతో డీలా పడిపోయిన కమల్ "విక్రమ్" మూవీ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం కమల్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఇండియన్ 2" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఇండియన్ అనే మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. అలా ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న సినిమా కావడంతో "ఇండియన్ 2" మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. "ఇండియన్ 2" మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ ,  సిద్ధార్థ్ , ఎస్ జే సూర్య ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సంబంధించిన అన్ని పనులు దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ ని ఈ సంవత్సరం మే నెలలో విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరో ఒకటి , రెండు రోజుల్లో ఈ మూవీ మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: