తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటనలో జయం రవి ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ సినిమా లలో నటించి వాటిలో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటుడి గా కెరియర్ నీ కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన సైరన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీన్లో అనుపమ పరమేశ్వరన్ , కీర్తి సురేష్ హీరోయిన్ లుగా నటించగా ... సముద్ర ఖనిమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

మూవీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తాజాగా విడుదల అయిన సందర్భంగా ఈ సినిమాలో హీరో గా నటించిన జయం రవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా జయం రవి మాట్లాడుతూ ... లోకేష్ కనకరాజు "మా నగరం" మూవీ తర్వాత ఖైదీ మూవీ కథను నాకు చెప్పాడు. ఆ కథ నాకు సూపర్ గా నచ్చింది. కానీ ఆ సమయం లో వేరే సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల ఆ సినిమా నేను చేయలేకపోయాను అని తెలియజేశాడు.

ఇకపోతే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఖైదీ సినిమాలో కార్తీ హీరో గా నటించాడు. ఈ మూవీ తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ.తో కార్తీక్ క్రేజ్ కూడా చాలా వరకు పెరిగింది. ఇకపోతే జయం రవి "ఖైదీ" సినిమా ఆఫర్ ను మిస్ చేసుకున్నాను అని చెప్పడంతో ఈయన కనక ఆ సినిమాలో చేసి ఉంటే ఈయన క్రేజ్ కూడా భారీగా పెరిగేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jr