విశ్వ సుందరి మనుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన పృథ్వీరాజ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ మూవీ ద్వారా ఈ నటికి కూడా భారీ స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ ఈ సంవత్సరం మార్చి 1 వ తేదీన తెలుగు , హిందీ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను భారీగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే మనుషి కి కూడా తెలుగు లో మంచి క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ పలుచటి రెడ్ కలర్ శారీని కట్టుకొని వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc