ప్రతి వారం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని కొన్ని వారాల్లో మాత్రం మంచి క్రేజ్ ఉన్న సినిమాలు చాలా ఒకే రోజు విడుదల అవుతూ ఉంటాయి. అలా ఈ సంవత్సరం మార్చి 22 వ తేదీన కూడా మంచి క్రేజ్ ఉన్న మూడు సినిమాలు ఒకే రోజు థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఆ ఒక్కటి అడక్కు : తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటలలో ఒక్కరు అయినటువంటి అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఈ కామెడీ ఓరియంటెడ్ మూవీ ని మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఓం బిమ్ బుష్ : టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడుగా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు హీరో గా రూపొందిన ఈ సినిమాను మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది : కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించినటువంటి గీతాంజలి మూవీ కి కొనసాగింపుగా రూపొందిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను కూడా మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించగా సునీల్ , సత్యం రాజేష్ , షకలక శంకర్ , సత్య ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూడు సినిమాలు కూడా మార్చి 22 వ తేదీన విడుదల కానున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: