ర‌ష్మి గౌత‌మ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్ చేసినా పెద్ద‌గా క్లిక్ కాలేక‌పోయిన ర‌ష్మి.. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా హాట్ యాంక‌ర్‌గా తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం టీవీ షుల‌తో పాటు అడ‌పా త‌డ‌పా సినిమాలు కూడా చేస్తున్న ర‌ష్మి.. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోషూట్ల‌తో అందాలు ఆర‌బోస్తూ అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు యాంకరింగ్ చేసింది.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. 2002లో సవ్వడి తో సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది రష్మీ. కానీ ఆ విడుదల కాలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన హోలీ లో కీలకపాత్ర పోషఇంచింది. ఆ తర్వాత యువ అనే సీరియల్లో కనిపిచింది. 2010లో వచ్చిన ప్రస్థానం లో సహాయ నటిగా కనిపించింది అందాల రష్మీ. 2016లో గుంటూర్ టాకీస్ తో కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అంతం, తను వచ్చెనంట చిత్రాల్లో నటించింది.

ఇటీవల బాయ్స్ హాస్టల్ లో ముఖ్య పాత్ర పోషించింది రష్మీ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అయితే బుల్లితెరపై సుందీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న రష్మీ గౌతమ్.. ఆఫర్లు వచ్చినప్పుడల్లా హీరోయిన్‌గానూ నటిస్తూ వస్తోంది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో చిత్రాల్లో ఈ అమ్మడు ఫీమేల్ లీడ్ రోల్‌లో కనిపించింది. కానీ, వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే రష్మీకి భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఆమె చాలా మూవీల్లో నటించినా.. హిట్లు మాత్రం పెద్దగా దక్కించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: