2022లో వచ్చిన భామాకలాపం ఓటీటీ సినిమా చాలా పాపులర్ అయింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఆ చిత్రం మంచి వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత దానికి సీక్వెల్‍గా ‘భామాకలాపం 2’ మూవీ వచ్చింది. భామాకలాపం 2 చిత్రానికి అభిమన్యు తాడమేటి దర్శకత్వం వహించారు. బంగారు కోడి పుంజు దొంగతనం చుట్టూ ఈ కథ ఇంట్రెస్టింగ్‍గా సస్పెన్స్‌తో  ఉంటుంది. నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఈ సీక్వెల్ మూవీకి భారీగా వ్యూస్ వస్తున్నాయి. అలాగే, మరో భాషలోనూ ఈ సినిమా రానుంది. భామాకలాపం 2 చిత్రంలో ప్రియమణి, శరణ్య ప్రధాన పాత్రలు పోషించగా..

సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, సుదీప్ వేద్, అనూజ్ గుర్వారా, చైతూ జొన్నలగడ్డ, రుద్ర ప్రతాప్ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారీ మ్యూజిక్ అందించారు. గతేడాది జవాన్ తో భారీ హిట్ అందుకుంది. ఇక ఇటీవల భామా కలాపం 2 వెబ్ సిరీస్‏తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పుడు ఈ భామ కీలకపాత్ర పోషించిన ఆర్టికల్ 370 మూవీ విజయవంతంగా దూసుకుపోతుంది.. తాజాగా ఈ అమ్మడు ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది.. ఆ కారు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ కారు ధర విని నెటిజన్లు షాక్ అవుతున్నారు..

జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ కొనుగోలు చేసింది ప్రియమణి. మార్కెట్లో ఈ కారు ధర దాదాపు రూ. 74 లక్షల వరకు ఉంటుంది.  ఇక ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్..  సెకండ్ ఇన్నింగ్స్‏లో దూసుకుపోతుంది. థియేటర్లలో, ఓటీటీలలో వరుస లు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: