మంచి కంటెంట్ ఉన్న కథలు ఎంచుకొని టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హీరోస్ గా పేరు తెచ్చుకున్న న్యాచురల్ స్టార్ నాని త్వరలోనే 'సరిపోదా శనివారం' అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాని లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. నిన్న నాని పుట్టినరోజు సందర్భంగా అతని అప్కమింగ్ మూవీస్ కు సంబంధించి అప్డేట్స్ రావడం జరిగింది.అందులో ముందుగా సరిపోదా శనివారం గ్లింప్స్ రిలీజ్ చేశారు.అయితే ఈ గ్లింప్స్  సినిమా పై అంచనాలను పెంచేసింది. హింసకి దూరంగా ఉండే ఓ సాధారణ యువకుడు వారంలో ఒక్కరోజు అది కూడా శనివారం రోజు కోపంగా మారితే ఎలా ఉంటుందినే యూనిక్ పాయింట్ తో ఈ సినిమా ఉండబోతోంది. నానితో 'అంటే సుందరానికి' సినిమాని డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ఈసారి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఓ యూనిక్ పాయింట్ తీసుకొని కంప్లీట్ కమర్షియల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సాహో డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. #Nani32 పేరుతో అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఇంకా ఈ వీడియోలో సినిమా ఎలాంటి పాయింట్ తో ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసారు.


వైలెంట్ ని తగ్గించి సంగీతానికి ప్రయారిటీ ఇవ్వాలంటూ ఈ మూవీలో చూపించారు. ఇందులో కొందరు విలన్స్ పరిగెడుతుంటారు. తరువాత వారిని ఓ వ్యక్తి కొట్టి పడేస్తాడు. ఆ తర్వాత అతని లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సినిమా యొక్క ప్రధాన కథాంశమని చూపించారు. ఇంకా అంతేకాదు ఓ హింసత్మకమైన వ్యక్తి అహింసాత్మకంగా మారితే అతని జీవితం ఎలా తలకిందులయింది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. సినిమాలో నాని హింసను ఎందుకు వీడాడు? ఆ తర్వాత ఆయన లైఫ్ ఇలా చేంజ్ అయింది అనే థీమ్ తో ఈ సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. 'OG' లాగే ఇందులో కూడా గన్స్, బుల్లెట్స్ ని హైలైట్ చేసి చూపించారు. ఈ సినిమా తర్వాత బలగం వేణుతో విలేజ్ బ్యాక్ డ్రాప్ రూరల్ ఎమోషనల్ డ్రామా చేయబోతున్నాడు నాని. దిల్ రాజు ప్రొడక్షన్లో రూపొందనున్న ఈ మూవీకి 'ఎల్లమ్మ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. మొత్తంగా ఈసారి నాని పలు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని బాగా అలరించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: