మాచో స్టార్ గోపీచంద్ కొంత కాలం క్రితం కబడ్డీ క్రీడా నేపథ్యంలో రూపొందిన సిటీ మార్ అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీ కి సంపత్ నంది దర్శకత్వం వహించగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత గోపీచంద్ , మారుతి దర్శకత్వంలో రాశి కన్నా హీరోయిన్ గా రూపొందిన పక్క కమర్షియల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత ఈ నటుడు శ్రీ వాసు దర్శకత్వంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా రూపొందిన రామబాణం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇకపోతే ఈ మూవీ కూడా గోపీచంద్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. ఇలా వరుసగా రెండు మూవీ లతో ప్రేక్షకులను నిరాశ పరిచిన గోపీచంద్ తాజాగా బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మాళవిక శర్మ , ప్రియ భవాని శంకర్ హీరోయిన్ లుగా నటించగా ... కన్నడ దర్శకుడు హర్ష ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదలకు రెడీ అవుతున్న సందర్భంలో ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను అమ్మి వేసినట్లు అందులో భాగంగా ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి స్టార్ మా సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే బీమా సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc