మాస్ మహారాజా రవితేజ తాజాగా ఈగల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి కార్తీక్ ఘట్టమనేని అనే యువ దర్శకుడు దర్శకత్వం వహించగా ... అనుపమ పరమేశ్వరన్ , కావ్య దాపర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. సందీప్ కిషన్మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా ఫిబ్రవరి 9 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇక చివరిగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సంస్థ దక్కించుకున్నట్లు ఆ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. దీనితో ఈ సినిమా ఈటీవీ విన్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇకపోతే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఈటీవీ విన్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు కూడా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సంస్థ వారు ఈగల్ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు కూడా అధికారికంగా ప్రకటించారు. దీనితో ఈ సినిమా ఈటీవీ విన్ మరియు అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" రెండింటిలో కూడా ఒకే సారి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: