తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటి మనులలో కృతి శెట్టి ఒకరు. ఈ ముద్దు గుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందినటువంటి ఉప్పెన అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ కి బుచ్చిబాబు సన అనే దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈయన ఈ సినిమాతోనే దర్శకుడుగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా ... విజయ్ సేతుపతి ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. 

ఇకపోతే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ఇందులో ఈ బ్యూటీ తన నటనతో అంతకుమించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. అలాగే ఆ తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో నటించిన ఉప్పెన , సింగరాయ్ , బంగార్రాజు మూవీ లు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర విజాయలను అందుకున్నాయి. ఆ తర్వాత మాత్రం ఈమె నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ద్వారా మంచి విజయం సాధించలేదు. 

ఇక ప్రస్తుతం ఈమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి వాటితో ఏ స్థాయి విజాయలను అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా కృతి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అంతే హాట్ యాంగిల్స్ లలో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks