టాలీవుడ్ యువ నటుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సునీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితం చిత్రలహరి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా ... కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరించాడు.

మూవీ లో కళ్యాణి ప్రియదర్శిని  సాయి ధరమ్ తేజ్ కి జోడి గా నటించగా ...నీవేతా పెత్రజ్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. 2019.వ సంవత్సరం మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా ఆ టైమ్ లో మంచి విజయం అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ ను రూపొందించాలి అని ఈ మూవీ బృందం అనుకుంటున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సీక్వెల్ గా ఓ సినిమాను తీయాలి అని డిసైడ్ అయినట్లు ... అందులో భాగంగా ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నట్లు అన్ని కుదిరితే మరికొన్ని రోజుల్లో ఈ మూవీ సీక్వెల్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే సాయి తేజ్ ఆఖరుగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈయన తన తదుపరి మూవీ ని సంపత్ నంది దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. మరి ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sdt