ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించి నటుడుగా మంచు గుర్తింపును సంపాదించుకున్నటువంటి హర్ష చెముడు తాజాగా సుందరం మాస్టర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హర్ష వర్ధన్ , దివ్య శ్రీపాద , బాలకృష్ణ నీలకంఠపు , భద్రం తదితరులు ముఖ్య పాత్రలు చేయగా ... కళ్యాణ్ సంతోష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రవితేజ , సుధీర్ కుమార్ కుర్రు ఈ సినిమాని నిర్మించగా ... శ్రీ చరణ్ పాకాలమూవీ కి సంగీతం అందించాడు.  

దీపక్ యెరగేరా ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయగా ... కార్తీక్ వున్నవా ఈ మూవీ కి ఎడిటర్ గా వర్క్ చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫిబ్రవరి 23 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల కంటే ముందు ఈ మూవీ బృందం ఈ చిత్రం నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల ఆయన ఈ సినిమా ప్రస్తుతం డీసెంట్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా  వసూలు చేస్తుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ మొదటి వీకెండ్ ను ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ చేసుకుంది. మొదటి వీకెండ్ లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా డీసెంట్ కలెక్షన్ లు లభించాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్ లకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ బృందం వారు తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ మూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 4.68 ప్లస్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: