ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లోని ఈ ముద్దు గుమ్మ నటించిన ఐటమ్ సాంగ్ కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే స్కంద , ఏజెంట్ మూవీ లలో ఐటమ్ సాంగ్ లలో నటించి తన అందాలతో , డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఈ బ్యూటీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ బాలకృష్ణ హీరో గా బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటికి తెలుగు లో హీరోయిన్ గా కూడా మరిన్ని అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది.

ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ పుట్టిన రోజు జరిగిన విషయం మనకు తెలిసిందే. ఆ పుట్టిన రోజు వేడుకల్లో ఈ ముద్దు గుమ్మ 24 క్యారెట్ బంగారపు పూత పూసిన కేక్ ను కట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటోలకి నటిజెన్ల నుండి అనేక రకాల కామెంట్లు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ కట్ చేసిన కేక్ ధర గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఊర్వశి తాజాగా కట్ చేసిన కేక్ ధర దాదాపుగా 3 కోట్ల విలువ అని ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: