తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న కొరటాల శివ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు కొరటాల శివ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన యాక్షన్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ యొక్క పాటల చిత్రీకరణను వచ్చే నెల తొలి వారం నుండి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మొదట ఈ చిత్ర బృందం వారు హీరో , హీరోయిన్ పై ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ సాంగ్ ను గోవా మరియు కొచ్చి లలో ఉన్న అద్భుతమైన లొకేషన్ లలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.  అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఎన్టీఆర్ , కొరటాల కాంబినేషన్ లో ఇది వరకు రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో విరి కాంబో లో పొందుతున్న రెండవ సినిమా కావడంతో ఈ మూవీ.పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: