కెరియర్ ప్రారంభంలో ఎన్నో తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దు గుమ్మ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు లో తనకంటూ నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ బ్యూటీ కి హిందీ సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు దక్కడం ... అలాగే ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలలో చాలా మూవీ లు కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లి పోయింది.

ఇకపోతే హిందీ.లో మంచి క్రేజ్ వచ్చిన తర్వాత ఈ బ్యూటీ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఇకపోతే కొంత కాలం క్రితమే కత్రినా కైఫ్ , సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన "టైగర్ 3" సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించక పోయినప్పటికీ ఇందులో ఈ బ్యూటీ మాత్రం తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ కి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉండడంతో ఈమె ఒక్కో సినిమాకి 15 నుండి 25 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ బ్యూటీ కచ్చితంగా ఇంతే రెమ్యూనరేషన్ తీసుకోవాలి అని ఏమీ అనుకోకుండా ఒక వేళ సినిమా కథ , అందులోని తన పాత్ర కనుక అద్భుతంగా నచ్చినట్లు అయితే చాలా తక్కువ రెమ్యూనరేషన్ కి కూడా సినిమాలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని సినిమాలకు చాలా తక్కువ డేట్ లో కేటాయించవలసి ఉంటుంది. అలాంటి సినిమాలకు కూడా ఈ బ్యూటీ చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kk