బాలీవుడ్ లో కంటెంట్ బాగుంటే ఎంత చిన్న సినిమా అయినా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అందులోను వాస్తవంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలు అయితే ఎన్నో రికార్డులు సృష్టిస్తాయి. "కాశ్మిర్ ఫైల్స్", "ది కేరళ స్టోరీ" సినిమాలు అయితే సరికొత్త రికార్డులు నమోదు చేశాయి.తాజాగా 'ఆర్టికల్ 370' అనే సినిమా రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయింది. గతవారం రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం బాలీవుడ్ ని షేక్ చేస్తూ అక్కడ సాలిడ్ వసూళ్ళని రాబడుతూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది.ఇక సినిమా కథ విషయానికి వస్తే ఆర్టికల్‌ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. యామీ గౌతమ్‌ ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌ రోల్ లో నటించి మెప్పించింది. అలాగే టాలీవుడ్ బ్యూటీ ప్రియమణి కూడా ఈ మూవీలో కీలకపాత్ర పోషించింది. ఆదిత్య సుహాస్‌ జంభాలె దర్శకత్వం వహించిన ఈ మూవీ బాలీవుడ్ నాట కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.


కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా.. పైగా పెద్ద స్టార్ హీరోయిన్ కూడా కాదు, అలాంటిది ఆర్టికల్ 370 సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయంటే అసలు మాములు విషయం కాదు. ఎన్నో రికార్డులు సెట్ చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది బాలీవుడ్ ఫస్ట్ హిట్టుగా నిలిచింది. ఇప్పటికీ సాలిడ్ వసూళ్ళని నమోదు చేస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన యామి గౌతమ్ తెలుగు వారికి సుపరిచితమే. తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది.


నువ్విలా సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఆ తర్వాత అల్లు శిరీష్ హీరోగా డెబ్యూ ఇచ్చిన 'గౌరవం' సినిమాలో హీరోయిన్ గా నటించింది. తరుణ్ తో కలిసి 'యుద్ధం', నితిన్ తో 'కొరియర్ బాయ్ కళ్యాణ్' ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కానీ.. ఈ బ్యూటీని ఒక్క హిట్టు కూడా దక్కలేదు.దాంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలే కరువయ్యాయి. అయితే హిందీలో మాత్రం ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో చెలరేగిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన 'ఆర్టికల్ 370' ఓ రేంజ్ లో హిట్టయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: