తెలుగు సినీ పరిశ్రమలో మంచు గుర్తింపు కలిగిన నటనలో ఒకరు అయినటు వంటి మెగా పిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ మనుషి చిల్లర్ హీరోయిన్ గా నటించగా ... నవదీప్మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు . శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను మార్చి 1 వ తేదీన తెలుగు , హిందీ భాషలలో థియేటర్ లలో విడుదల చేయనున్నారు . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. 

అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాల ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది . ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు . ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నైజాం ఏరియా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లుగా అధికారికం గా ప్రకటించింది.

అలాగే మరి ముఖ్యంగా హైదరాబాదు లోని ఆర్టీసీ క్రాట్స్ రోడ్స్ ఏరియాలోని సంధ్య 70 ఎంఎం లో కూడా ఈ సినిమా టికెట్స్ బుకింగ్ లు ఓపెన్ అయినట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే వరుసగా ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలను ఎదుర్కొంటున్న వరుణ్ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మార్చి 1 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt