అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , అలీ , సునీల్ , సత్య , షకలక శంకర్ , ముఖ్యపాత్రలో జీవి నిర్మాణంలో ... శివ తుర్లపాటి దర్శకత్వంలో "గీతాంజలి మళ్లీ వచ్చింది" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన గీతాంజలి అనే హర్రర్ కామెడీ జోనర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. ఇలా ఇప్పటికే సక్సెస్ అయిన మూవీ కి కొనసాగింపుగా రూపొందిన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

ఇక కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఓ టీజర్ ను విడుదల చేయగా అది కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. ఇకపోతే ఈ మూవీ ని మొదట ఈ సంవత్సరం మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాని మార్చి 22 వ తేదీన కాకుండా ఏప్రిల్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను సరిగమ సినిమా సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సంస్థ వారు ఈ సినిమాను ఓవర్ సీస్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: