టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ మధ్యకాలంలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే రకుల్ ప్రీతిసింగ్ జాకీభగ్నని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఇప్పుడు మరొక హీరోయిన్ తాప్సీ పన్ను కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. పదేళ్లుగా తాను ప్రేమలో ఉన్న విషయాన్ని ఇటీవలే తెలియజేసింది.. అతడినే తాప్సి వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. తన బాయ్ ఫ్రెండ్ డెన్మార్క్ బ్యాట్మింటన్ ప్లేయర్ మథియస్ బోయ్ ను తాప్సి గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారట.


తాప్సి వివాహం మార్చి నెలలో జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.రాజస్థాన్లో ఉదయపురి వేదికగా వీరి వివాహం జరగబోతోంది. కేవలం కుటుంబ సభ్యులు కొంతమంది సినీ సెలబ్రిటీలు బంధువుల సమక్షంలో వీరి వివాహం జరగబోతుందనీ టాక్ వినిపిస్తోంది.. అయితే వీరి వివాహం సిక్కు క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరగబోతుందని తెలుస్తోంది.. సుమారుగా తాప్సి 10 ఏళ్ల పాటు మథియస్ బోయ్ తో ప్రేమలో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని ఎక్కడ బయటపడకుండా చూసుకుంది.. ఇటీవలే ప్రముఖ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది.


బాలీవుడ్లో తన మొదటి సినిమా చెస్మి బద్దూర్ షూటింగ్ 2013లో జరిగిందని అప్పుడే మథియస్ బోయ్ ను కలిశానంటూ వెల్లడించింది. అతనితో రిలేషన్ లో తాను చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలియజేసింది.ఇలా దశాబ్దం నుంచి తాప్సి తన బాయ్ ఫ్రెండ్ తో లవ్ స్టోరీని సైతం నడిపిస్తున్నట్లు తెలిపింది.. 2010లో తెలుగు సినిమా ఝుమ్మంది నాదంతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో తెలుగులో సినిమాలలో నటించింది.అలాగే తమిళ్ మలయాళం లో కూడా నటించింది. 2013లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన పింక్ చిత్రంతో భారీ క్రేజ్ అందుకుంది. అలా వరుసగా బాలీవుడ్ లోనే సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది తాప్సి. ఇటీవలే తాప్సి ఢంకి సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. మరి తాప్సి పెళ్లిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: