తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటీమణులలో మిల్కీ బ్యూటీ తమన్న ఒకరు. ఈ ముద్దు గుమ్మ హ్యాపీ డేస్ మూవీ తో మంచి క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకొని ఆ తర్వాత నుండి అదిరిపోయే రేంజ్ విజయవంతమైన ఎన్నో సినిమాలలో నటించి చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్నానానికి వెళ్లిపోయింది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సినిమాలో అవంతిక అనే పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో అవంతిక పాత్రలో తమన్నా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో తమన్నా కు కూడా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన ల గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా తమన్నా , అవంతిక పాత్రకు నన్ను ఎందుకు తీసుకున్నారు అని రాజమౌళి ని అడిగిన ప్రతి సారి ఆయన ఏం చెప్పేవాడు అనే విషయం గురించి తెలియజేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న తమన్నా ... అవంతిక పాత్ర గురించి రాజమౌళి స్పందించిన విధానాన్ని తెలియజేస్తూ ... నేను చాలా సార్లు రాజమౌళి గారిని సార్ నన్నే ఎందుకు ఈ సినిమాలో అవంతిక పాత్రకు ఎంచుకున్నారు అని అడిగాను. దానికి ఆయన ఎప్పుడు సమాధానం చెప్పలేదు. అలా అడిగిన ప్రతి సారి కేవలం ఓ చిన్న నవ్వు నవ్వి పక్కకు వెళ్లిపోయేవాడు. చివరికి ఇప్పటికీ కూడా నాకు బాహుబలి సినిమాలో అవంతిక పాత్రకు నన్ను ఎందుకు రాజమౌళి ఎంచుకున్నారు అనే విషయం తెలియదు అని తమన్నా చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం తమన్న అనేక సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: